పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0324-3 శంకరాభరణం సంపుటం: 11-141

పల్లవి: బడిబడిఁ దిరిగాడీ బాలకృష్ణుఁడు
         యెడయనిజాణ గదె యీ బాలకృష్ణుఁడూ

చ. 1: సొక్కుచు సోలుచు వచ్చి సుదతులు యెత్తుకొంటె
       పక్కన నవ్వులు నవ్వీ బాలకృష్ణుఁడు
       యిక్కువకుఁ జేయి చాఁచీ నేడ నైనాఁ దొంగి చూచీ
       యెక్కుడు గామిడి గదె యీ బాలకృష్ణుఁడు

చ. 2: చన్ను లంటి సారె సారె చవిగా ముద్దులు వెట్టి
       పన్నీఁ గదె మెహ మెల్ల బాలకృష్ణుఁడు
       సన్నలనె మొక్కు మొక్కీ సమ్మతిఁ బయ్యద దీసీ
       యేన్నేసి నేరిచినాఁడె యీ బాలకృష్ణుఁడు

చ. 3: నిండుఁగాగిట నించి నేరుపులు పచరించి
        బండుమాట లాడీఁ గదె బాలకృష్ణుఁడు
        అండనె శ్రీవెంకటాద్రి నాయ మెరిఁగి తాఁ గూడె
        యెండ నీడ కన్నులతో నీ బాలకృష్ణుఁడూ