పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0324-2 శంకరాభరణం సంపుటం: 11-140

పల్లవి: చెప్ప నే మున్నవి నీ నేసెటిచేఁతలు
         అప్పటి కప్పటివేళ అను వింతే కాకా

చ. 1: చేరి మొక్కఁగా నీవు సెలవి నవ్వేవు గాక
       వూరకుండవా నీయంత నొగి నిందాఁకా
       యేరీ తని యాడ వచ్చు నిటువంటి నీ చిత్తము
       వారికి వారికి భాగ్యవశ మింతే కాకా

చ. 2: చెనకఁగా నీ వంతలో చిమ్మి రేఁగే వింతే కాక
       తనిసి గుట్టున నుంటేఁ దడవేవా
       ఘన మైన నీ మహిమ కానఁగ నెట్ల వచ్చు
       గొనకొన్న నీ యిచ్చకొలఁదే కాకా

చ. 3: బలిమి గూడఁగా నీవు పైకొంటి విపుడె కాక
       తెలుసుకొంద మ నెంటే తేటపడేవా
       నెల వై శ్రీవెంకటేశ నిచ్చళించ నెట్టు వచ్చు
       కులికెటి నీ వలపు కొలఁదే కాకా