పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0324-1 సాళంగనాట సంపుటం: 11-139

పల్లవి: జయ మాయ నీకు నాపె సరసములూ
         నయగారి ముడుయము నారసింహా

చ. 1: మోము చూచి నీతోడ ముచ్చట లాడ వలసి
       కోమలి నీ తొడమీఁదఁ గూచున్నది
       ఆముకొని అట్టె మాట లాడ వయ్య ఆపెతోడ
       నామాట విని యిట్టె నారసింహా

చ. 2: మన్నన నీ యలుకల మంకు దెలవ వలసి
       చన్ను లురమునఁ బెట్టి సత మైనది
       చెన్నుఁడ వాపె చనవు చెల్లించ వయ్య యిట్టె
       న న్నడిగే దింకా నేమి నారసింహా

చ. 3: చేతుల నిన్ను నలమి చెక్కుఁ జెక్కుఁ గదియించి
        నీతితో నీ మెడసొమ్మై నెలకొన్నది
        యీతల శ్రీవెంకటాద్రి నెనసితి వాపెతోడ
        నా తలఁపు లీడేరించి నారసింహా