పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0323-6 కన్నడగౌళ సంపుటం: 11-138

పల్లవి: నీమేలులోనిదాన నీవు మన్నించేటిదాన
         దోమటి నన్నియు నీ చేతుల నున్న విఁకను

చ. 1: సేస వెట్టి నవ్వినట్టిచెలియను నేను నాకు
       ఆసలు రేఁచితి విఁక నలయించకు
       వాసితో నీ వే మనినా వద్దనేటిదానఁ గాను
       దోసముఁ ఋణ్యము నీ చేతుల నున్న విఁకను

చ. 2: యిల్లాల నయినయట్టి యిచ్చకురాల నా
       వుల్లము దెలుసుకొంటి వొరసితిని
       వెల్లవిరి నీ వెటున్నా వెంగె మాడేదానఁ గాను
       తొల్లిటిబాసలు నీ చేతుల నున్న విఁకనూ

చ. 3: పట్టపుదేవిని నాపంత మెల్లా నీడేరించి
       జిట్టిగొంటివి నామాట సమ్మతించితి
       గుట్టుతో శ్రీవెంటేశ కూడితివి వింతగాను
       తొట్టి నా భోగము నీ చేతుల నున్న దిఁకనూ