పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0323-3 సామంతం సంపుటం: 11-135

పల్లవి: కందము నీ సరితలు కడదాఁకాను
         యిందరిలో నన్న మాఁట లేల బొంకే విఁకను

చ. 1: పంతగాఁడ వౌదువు పడఁతి నింత యెంచితి
       వంత నీకుఁ బెద్దరిక మైతేఁ జాలు
       వంతు లాడేవు పిలువ వచ్చినమాతోనె నీవు
       యింత గుండెవాఁడ వైతే నెటు వొయ్యీఁ బనులు

చ. 2: నేరుపరి వౌదువు నెలఁతఁ బాసి వుంటివి
       ఆరయ నీ కింత చవు లైఁతే జాలు
       చేరువకు వచ్చి లో లో‌ సిగ్గు వడే వప్పటిని
       యీ రీతి నుండితేఁ జాలు నీడేరె మోహము

చ. 3: మంచివాఁడ వౌదువు మగువఁ గూడితి విట్టె
        అంచెల నీ కిదే పని యైతేఁ జాలు
        ముంచిన శ్రీవెంకటేశ మెదలె యిట్టుండ రాదా
        యెంచేము నీ గుణములు యే మాయ నిపుడు