పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0323-1 ముఖారి సంపుటం: 11-133

పల్లవి: ఎంత కెంత సేసేవు యేమమ్మా
         చింత దీర నాతనిపైఁ జెయి వేయ వమ్మా

చ. 1: చేతిమీఁది చెక్కి దేల చెలవుఁడు వేఁడుకొనీ
       అతనిమాటలు కాని మ్మన వమ్మా
       రాతిటనుంటియు జాగరములె సేయఁగఁ బట్టె
       యీ తరుణులఁ జూ చైన యియ్యకొన వమ్మా

చ. 2: కొప్పు ముడవ వి దేల కోపము దీర్చె నాతఁడు
        చెప్పిన ట్టల్లా నిఁకఁ జేయ వమ్మా
        ఱెప్పలు రిచ్చవడె మీ ఱేసు లెల్లాఁ జూచి చూచి
        చిప్పిల నీ నవ్వులనె సేసవెట్ట మమ్మా

చ. 3: వట్టి మోనా లిఁక నేల వాఁడె సరసము లాడీ
       పట్టినచలము మాని పలుక వమ్మా
       యిట్టె శ్రీవెంకటేశుఁ డితఁడు గూడె నిన్ను
       నెట్టుకొని రతుల నిన్నిటా మెచ్చ వమ్మా