పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0322-5 రామక్రియ సంపుటం: 11-131

పల్లవి: ఏనుగలతోడ నేల యేలాటాలు
          కానుక లిచ్చె గుట్టు గనుకొనేను

చ. 1: రమ్మన నేఁటికి నిన్ను రాకు మన నేఁటికి
       వుమ్మడి నుండె నీ వోజ చూచేను
       సమ్మతించఁగా నెట్టొ జగడించఁగా నెట్టొ
       నిమ్మపంటిచేతితోడ నివ్వెర గందేనూ

చ. 2: నవ్వు నవ్వ నేఁటికి నాలితన మేఁటికి
        దవ్వులనుండె నీ తమి చూచేను
        పువ్వు లనఁగా నెట్టొ పూఁప లనఁగా నెట్టొ
        మువ్వంక సాసముత్యాల ముగ్గులు వెట్టేను

చ. 3: వొడఁబరచ నేఁటికి వోప నన నేఁటికి
        కడలేని మోహముతోఁ గాఁగిలించేను
        నడుమనె కూడితిని నమ్మించి శ్రీవెంకటేశ
        చిడుముడి నుంగరాలచేతఁ జెక్కు నొక్కేను