పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0322-4 సాళంగనాట సంపుటం: 11-130

పల్లవి: మేలు మేలు బాపు బాపు మెచ్చితి నిన్ను
         తాలిమితో నున్నాఁడవు తగవరి వౌదువు

చ. 1: యేకడనో వుంటి వట యే మేమో సేసితి వట
       ఆకె నాతోఁ జెప్పనవి ఆ మాటలె
       వాకున నాడ నోపక వాసితో నూరకుండితే
       నీకు నీకె నవ్వేవు నెరజాణ వౌదువు

చ. 2: మంతనా లాడితి వట మరికొన్ని గల వట
        యింతి నాకు మొక్కినది యీ సుద్దికె
        అంత నిన్నుఁ బచ్చి సేయ కట్టె అణఁచుకుంటే
        దొత వెట్టేవు సటలె దొరవు నీ వౌదువు

చ. 3: వొడఁబరచితి వట వొక్క టై కూడితి వట
        పడఁతి యెచ్చరించె నీ పనులకునె
        తడవక నే నుండితె తలపించే నప్పటిని
        అడరి శ్రీవెంకటేశ అంతవాఁడ వౌదువు