పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0322-3 పాడి సంపుటం: 11-129

పల్లవి: చెప్పరా దిందాఁక నైతె చెలి యున్న భావము
         వుప్పుచిం దినుమడించె నుండ నుండఁగాను

చ. 1: మగువకు నేఁడుగా మనికిత మెల్లఁ బానె
       వెగటు వో నీ వింటికి విచ్చేయఁగాను
       మొగచాటు లే దాయ ముచ్చట లెల్లఁ దీరె
       సొగిసి నీవు మొగము చూడఁగాను

చ. 2: సుదతి కీ వేళ గా షోడశకళలు నిండె
       మదనజకనకపు నీవు మన్నించఁగాను
       తుదిపదమున కెక్క తుందుడుకు లెల్లఁ బోయ
       పొదిగి పట్టి కాఁగిట బుజ్జగించఁగాను

చ. 3: అంగన కిట్టె కా ఆతు మెల్ల జల నాయ
       సంగతిగా రతిఁ గూడి చన వియ్యఁగా
       చెంగల శ్రీవెంకటేశ చేరఁగలమేలు చేరె
       సింగారించి మీఁద చెక్కు నొక్కఁగాను