పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0322-2 శ్రీరాగం సంపుటం: 11-128

పల్లవి: సరనుఁడవు నీ వైతే చదురాలు నీ కాపె
         ఆరు దాయ నన్నిటాను అమరు నిద్దరికే

చ. 1: చెప్పఁగలవల పెల్లఁ జెలి నీతోఁ జెప్పి చెప్పి
       చెప్పరానిమాటలకు సిగ్గు వడ్డది
       చిప్పిలునవ్వులఁ గొంత శిరసువంపులఁ గొంత
       అప్పగించీఁ దెలుసుకో అవ్వలివిన్నపము

చ. 2: సేయఁగల వూడిగాలు సేసి సేసి నీ కాపె
       నేయరానిచేఁతలకు సిగ్గు వడ్డది
       చేయెత్తిఁ మొక్కులఁ గొంత చిమ్మునిట్టూర్పులఁగొంత
       కాయము సోఁకఁగ జేసీ కడమ వూడిగెము

చ. 3: చెక్కు నొక్కు నొక్కి యిట్టె శ్రీవెంకటేశ్వర నిన్ను
        చెక్కు చేతితోడనె తా సిగ్గు వడ్డది
        పుక్కిటి విడేలఁ గొంత పొరచిచేఁతఁల గొంత
        గక్కన నీ కంది యిచ్చీ కడమదొడములు