పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0322-1 దేసాళం సంపుటం: 11-127

పల్లవి: రసికుఁడ వౌదు పండరంగినాథా నీ
         పసలఁ జిక్కిలి మిదె పండరంగినాథా

చ. 1: యివ్వల నవ్వల నేఁడు యిటు నీతో నవ్వి నవ్వి
       రవ్వైతిమి గదో పండరంగినాథా
       కువ్వ లాయ నీ చేఁతలు గురి యయితి మింతకు
       పవ్వళించితిరి మేలు పండరంగినాథా

చ. 2: రుచు లైన నీ మాఁటలె రూఢి కెక్కెంచెను మమ్ము
        రచనకాఁడ వో పండరంగినాథా
        యిచట నీ రాకలను నెదురు చూపించి మేలె
        పచరించితివి బాపు పండరంగినాథా

చ. 3: సారెఁ దీసితివి కొప్పు చన్ను లంటి చూచితివి
        రారాదా యిఁక పండరంగినాథా
        కూరిమి శ్రీవెంకటాద్రిఁ గూడి చొక్కించితి మమ్ము
        పైరు లాయఁ బులకలు పండరంగినాథా