పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0321-6 హిందోళవసంతం సంపుటం: 11-126

పల్లవి: ఏల వెగిరించేవె యీతనితోడ
         మూలలనె వుండ నీరె ముచ్చటల మాఁటా

చ. 1: చిత్తము వచ్చినచోట సేసినదె విన్నపము
       హత్తి పొసఁగనిచోట ననుమానమె
       యిత్తలఁ దన నా సంది యీ రెండుఁ దెలయుదాఁకా
       పొత్తులనె వుండ నీరె పొరుగుల మాఁటా

చ. 2: ఆస గలిగినచోట నాడినదె సరసము
       వేసట లయ్యినచోట విచారములె
       వాసితోఁ దనకు నాకు వైపులు గూడినదాఁకా
       మూసినట్టె వుండ నీరె ముందరి ఆమాఁటా

చ. 3: వొడఁబాటు గలచోల నొనగూడి వుండు నవ్వు
        వెడవెడ లైనచోట వేరువేరులె
        యెడయక శ్రీవెంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడె
        వొడికమైవుండ నీరె వొరపుల మాఁటా