పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0321-5 కన్నడగౌళ సంపుటం: 11-125

పల్లవి: మరుఁడు సేసేనమాయ మరి తెలియదు గాక
          సరవు లిద్దరివిని సరికి బే సాయనా

చ. 1: చనవు సేసుక నిన్ను సరిఁ గొంగు వట్టితిని
       యెనసి యింత నేయ నీ యీడుదాననా
       పెనఁగ కంతలో నీవు బెరసి లో నైతిని
       ననిచి కరణ యింత నా మీఁద నుండెనా

చ. 2: నవ్వు నేసుకొని నీపై నలిఁ జేయి వేసితిని
        రవ్వ నిన్నింత నేయ బీరపుదొరనా
        చివ్వన నీ వప్పటిని చేరి బత్తి సేసేవు
        యివ్వల నీ మోహము నన్నింత దొడ్డ సేసెనా

చ. 3: బలిమి సేసుక నే నీపయిఁ జేయి వేసితిని
        కలసితి వింతేసికిఁ గలనా నేను
        నెల వై శ్రీవెంకటేశ నీ వింకాఁ జెక్కు నొక్కేవు
        సలిగె లిన్నియు నీవె సమ్మతించితివా