పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0321-4 భైరవి సంపుటం: 11-124

పల్లవి: ఏమో యెరఁగను యోట్టైనాఁ గాని
         వేమరు నీ కెక్కినది వేడుక నా బదుకు

చ. 1: చింత దీర నీ మన్నన చెప్పుకొనఁగా విని
        పంతపుసతులు పకపక నవ్వేరు
        మంతనానా నీచేఁతలు మరి యే మైనాఁ గలవో
        యెంత వలచినది సి గ్గెంచ దంటానో

చ. 2: సమరతి నీ పాన్పుపై సరి నే నుండఁగాఁ జూచి
        జమళిఁ దమలోననె సన్న సేసేరు
        అమరదో నీవు నేనూ నంటుకొన్నపొందులు
        తమితో నాగర్వ మింత తగ దంటానో

చ. 3: చేరి వేడుకొంటా నే నీ చెక్కు నొక్కఁగాఁ జూచి
        సారెఁ దమమెకా లిచ్చలఁ జూచేరు
        యీరీతి శ్రీవెంకటేశ యిచ్చఁ గూడితిమి మన
        నేరుపుల నన్నిటాను నీవె నే నంటానో