పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0321-3 వరాళి సంపుటం: 11-123

పల్లవి: సొమ్ము గలవాఁడవు సోఁపు గని యిచ్చె కాక
         సమ్మతిఁ గాక వంచన సేయ వచ్చునా

చ. 1: సిగ్గువ డుండుత గాక చెనకే నీ చేఁతలకు
       తగ్గి తప్పించుకొంటేను తప్పు లెంచవా
       వొగ్గి మొదలనె నీకు వొప్పగించిన దీ మేను
       దగ్గరి పైకొంట గాక దాఁచ వచ్చునా

చ. 2: మోనాన నుండుత గాక మోహపు నీ మాటలకు
        దానికె నే మారాడితేఁ దమకించవా
        నానినది మొదలనె నానోరు నీ యెంగిటనె
        పూని పట్టుకుందుఁ గాక బొంకె నన వచ్చునా

చ. 3: ఆసతో నుండుత గాక అంటిన నీరతులకు
        వీస మంత నే మీరినా వెర గందవా
        నీ సొమ్ము మొదలనె నా నెయ్యము శ్రీవెంకటేశ
        మూసి దాఁచుకుందుఁగాక మొరఁగఁగ వచ్చునా