పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0321-2 బౌళి సంపుటం: 11-122

పల్లవి: వలెనా యింకా నంత వలపు గలయఁ బెట్ట
         సళుపుఁజూపుల నాయ సమతారుకాణలు

చ. 1: చేసినట్టిచేఁత లెల్లఁ జెల్లించ నీవు గలవు
       ఆస చూపి నీకు మొక్క నాపె గలదు
       యీసు లేక వోరుచుక యియ్యకొన నేఁగలను
       రాసి కెక్క నీవు నవ్వు రాకుండునా యిఁకను

చ. 2: పసిఁడిపట్టెమంచము పవళించి వుండఁ గల
       దసమున భోగించ నాపె గలదు
       పసగా నుండఁగను నా బంగారుమేడ గలదు
       వెస సంతంసాల విఱ్ఱవీఁగ వద్దా యిఁకను

చ. 3: వుంగరము వేలఁ బెట్ట నొరసి యాపె గలదు
        సింగారించుకొనను నీ చేయి గలదు
        అంగవించి నిన్నుఁ గూడేయందకు నేనూఁ గలను
        చుంగుల శ్రీవేంకటేశ చొక్క వద్దా యింకను