పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0320-6 వసంతవరాళి సంపుటం: 11-120

పల్లవి: వినవే యెక్కడి సుద్ది వేగ మామాట
         మనసులోఁ జల ముంటే మర్మములు మాన్పునా

చ. 1: యెంతేసి మాట లాడిన యెచ్చు కుందు గలిగినా
       కాంతలకు మగలకుఁ గలదా వేరు
       చింత దీర నావేళకు చెక్కు చేయే మరఁ గింతె
       పంతపు నెలవినవ్వు బతిమాలింపించెను

చ. 2: అవ్వలిమోము లై వున్నా నలుకలు ముంచుకన్నా
       జవ్వనపువలపుల చవి దప్పీనా
       దవ్వులై యావేళకు తలవంపులే మరఁగు
       చివ్వనఁ గనుచూపులె చెలుములు నేయవా

చ. 3: సిగ్గులు పైకొనినాను చేఁతలు గడు మీరినా
       నగ్గళపు రతివేళ నడ్డ మున్నదా
       యెగ్గు దీ శ్రీవెంకటెశుఁ డిట్టె నిన్నుఁ గూడె
       బెగ్గిలినాఁ దమకము ప్రియములు రేఁచునే