పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0320-3 హిజ్జిజి సంపుటం: 11-117

పల్లవి: చెప్పఁబోతే దనతోను సిగ్గయ్యీ నాకు
         యిప్పుడు వద్ద నున్నాఁడు యెచ్చరించరే

వ. 1: చూడఁగానె నా కన్నులు సొరిదిఁ జేరఁడే సాయ
       యిడఁ దన చక్కఁదన మెంతో కాని
       దాడితో నెడతెగదు తనమీఁది తలపోఁత
       వేడుకకు వెల లేదు విన్నవించరే

చ. 2: కదిసితే నా చన్నులు కాఁగెఁడేసి కాఁబెరిగె
       యిదివో తనభారము యెంతో కాని
       వొదగాయఁ దనమీఁద నుదు టైనతమకము
       యెదుట నా మోహ మెల్ల నెరిఁగించరే

చ. 3: పైఁకొనఁగ నాతురుము బారెఁడేసి కొన సాగె
       యీ కొలది తననేర్పు యిటు సేసెను
       దాకొని శ్రీవెంకటేశు తగు లైనకూటమి
       మేకొని నామారు మీరు మెచ్చఁ గదరే