పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0320-2 సాళంగనాట సంపుటం: 11-116

పల్లవి: అప్పటి నాతో నీవు ఆడ వలెనా
         కప్ప నేల పచ్చడము కాఁగి లుండఁగాను

చ. 1: తప్పని నీ కృప నాపై తగిలి వున్నది గాన
       ముప్పిరి నున్నవి నా మోముకళలు
       నెప్పున నీ మహిమకు నేనె తారుకాణ
       చెప్ప నేల నిఁక వేరె చేసి చూపఁగాను

చ. 2: చెలఁగు నీ మాటలు నా చెవి సోఁకినవి గాన
       పులకలు నా మేనఁ బొది గొన్నవి
       అలరు నీ మంచితనాలన్నిటికి నే గురతు
       తెలుప వలెనా వేరె దిష్టమై యండఁగను

చ. 3: అందపు నీ కూటమి నా కమరి వున్నది గాన
       సందడించి నాలోని సంతంసా లేల
       యిందు మనలో శ్రీవెంకటేశ యివె కారణము
       చెందఁగ వలెనా వేర చేకొ నుండఁగాను