పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0320-1 సామంతం సంపుటం: 11-115

పల్లవి: నాతోనె ఆన తీవయ్య నంటున సంతంసించేను
         చేతికి లో నైతి విఁకఁ జేరె నాకు మేలు

చ. 1: చెప్పి నే నంపినమాట చెవుల కిం పాయనా
       తప్పులు లేవు గదా ఆతరవాతను
       నెప్పున దాఁచఁగ నేల నిన్నుఁ బాయలే నంటి
       యిప్పు డిట్టె విచ్చేసితి వియ్యకోలా నీకు

చ. 2: జిగి నా కాకుక నీకు చిత్తము వచ్చెనా నేఁడు
       వెగట్లు నీవు గదా వేరె అందు
       నిగిడి కొంకఁగ నేల నీబాస దలఁచు మంటి
       అగపడితివి నాకు అవునా నా పొందులు

చ. 3: మొక్కిన నా మొక్కు నీకు మొగమోట కెక్కెనా
        మొక్కలము లేదు గదా మోహములోన
        యిక్కు వెరిఁగి శ్రీవెంకటేశ నన్నుఁ గూడితిని
        దక్కితిని యింత నాపై దయ గద్దా నీవూ