పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0319-6 సౌరాష్ట్రం సంపుటం: 11-114

పల్లవి: ఏలినవాఁడవు నేవె యే మయ్యా
         మేలు నాకు నీవల్ల మీఁద కిక్కి లయ్యా

చ. 1: అందగారి మాట లెల్ల నాడి నన్ను నమ్మించి
       కందువకుఁ దీసితివి గదవయ్యా
       చెందమ్మిరేకులవంటి చేరఁడేసి నా కన్నుల
       కిందు కెల్ల గురి యైతి విఁక నీ చిత్త మయ్యా

చ. 2: యింట నూరకుండేదాన నెలయించి నవ్వించి
        గంటి సేసితివి మోవి గదవయ్యా
       గొంటరి నా చనుఁబువ్వు గుత్తుల పూజలకును
       నంటున లో నయితిని నాఁడె కదవయ్యా

చ. 3: కోరి నీవు కాఁగిటిలో గూడినచనవు లెల్ల
       గారవానఁ చెల్లించితి గదవయ్యా
       యీరీతి శ్రీవేంకటేశ యెనసి నా చిత్తమనే
       వూరిలో నెలకొంటివి వొడఁబాటే అయ్యా