పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0319-4 పాడి సంపుటం: 11-112

పల్లవి: మూసినముత్యవలె మూల లే లోయి
         మోస మెట్లాఁ దేరె నిఁక మొరఁగే లోయి

చ. 1: పచ్చికస్తూరిబో ట్టంటి పరిమళించే దెల్లా
       మెచ్చులా యిద్దరిలో నీ మేననా వోయి
       గచ్చుల నెవ్వ రవుతా కానకుంటి మిందాఁకా
       మచ్చెము బాయిటఁ బడె మాటలాడ వోయి

చ. 2: ముడిచివేసే పువ్వులు ముంగిట రాలే దెల్లా
        చిడుముడి నెరుల నీ సిరసా వోయి
        యెడసి యీగురు తిది యేరుపడ దిందాఁక
        ఆడియాలము గంటిమి ఆన లేల వోయి

చ. 3: కుంకుమచెమటబొట్లు కురిసె నీడ నెల్లాను
        లంకెలైన నీ చెక్కుల లాగాలా వోయి
        అంకెల శ్రీవెంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
        సంకె లెల్లఁ దేరె నిఁక జాగు లేల వోయి