పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0319-2 ముఖారి సంపుటం: 11-110

పల్లవి: ఏల మాతోఁ జెల్లఁ బెట్టే వెమ్మెలు నీవు
         నాలి నేయ కిఁక నీవు నవ్వు వచ్చీ మాకు

చ. 1: పంత మేల నీవు నాతోఁ బచరించే వప్పటిని
       యెంత లేదు ని న్నిందఁరు నెరఁగనిదా
       కాంత యైతేఁ జాలు నీవు కడు గుజ్జైనాఁ గాని
       చింత దీర భోగించి సేస వెట్టవా

చ. 2: వాసు లేల నెరుపేపు వచ్చి వచ్చి నా ముందర
       నీ సుద్దులు మా కెల్ల నేఁడు గొత్తలా
       ఆసపడి ఆఁటదాని కడవు లెల్లాఁ దిరిగి
       రాసి కెక్కఁ దెచ్చుకొని రవ్వఁ బడవా

చ. 3: కడుఁ బరా కే లయ్యేవు గక్కన ధీరునివలె
       ఆడరి శ్రీవెంకటేశ ఆడ వలెనా
       మెడఁ గట్టుకొంటి విదె మించి యలమేల్‌‌మంగను
       తొడిఁబడ నన్నుఁ గూడి దొరవై నిలువవా