పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0319-1 కాంబోది సంపుటం: 11-109

పల్లవి: ఏమని మెత్తు నిన్ను యింత మేలు చేసితిని
         కామిని నామాన మిట్టె కాచితివి నీవు

చ. 1: యెదురు చూడగాఁనె యింతలో విచ్చేసి నీవు
       అదన నా చేయి వట్టి ఆదరించితి
       వదలుఁ బయ్యదతోడ వసివాడే నన్నుఁ జూచి
       పొదిగి పయ్యద గప్పి పొది సేనితివి

చ. 2: మొక్కుకోఁగానె నీకు ముంచి నాకు వర మిచ్చి
        చెక్కు నొక్కి బుజ్జగించి సేద దేర్చితి
        లక్కవంటి మదితోడ లాచక వుండిన నాతో
        మక్కువలు చల్లి చల్లి మంతన మాడితివి

చ. 3: చేయి చాఁచగానె నన్ను శ్రీవెంకటేశుఁడ కూడి
        చాయల నవ్వులు నవ్వి సన్న సేసితి
        పాయపువేడుకతోడ పదరుచు నుండేనన్ను
        ఆయము లంటుచు మరి అట్టె మన్నించితిని