పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0318-6 గౌళ సంపుటం: 11-108

పల్లవి: మోనాన నూరకె నీకు మొక్కేఁ గాక
          కానికలు సారె నేమి కప్ప మంపే నీకును

చ. 1: తలఁపు నామీఁద నీకు తగిలి వుండఁగాను
       చెలు లేమి విన్నపాలు సేసేరు నీకు
       చలిమి బమిలి నాకు సరి గలిగి యుండఁగ
       మలసి సొలసి యేమి మాటలాడే నిన్నును

చ. 2: మంతనాన నీవు నాకు మనసిచ్చి యండఁగాను
       దొంతులబుద్దులు యేమి దోఁచీ నీకు
       పంత మిచ్చి నీవు నాపై పక్షమై యుండఁగాను
       కొంత గొంత యిఁక నేమి గొసరేము నిన్నును

చ. 3: కందువల నీవు నన్నుఁ గాఁగిలించు కుండఁగాను
        విందుల నాగుణములు వింతా నీకు
        పొందుగ శ్రీవెంకటేశ పూఁచి నన్నుఁ గలసితి
        చందముగా యిఁక నేమి జరసేము నిన్నును