పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0318-5 శంకరాభరణం సంపుటం: 11-107

పల్లవి: ఏ మందు నా గుణ మిదె యెంత మెహించితినో
         చేముట్టి నీమీఁద నున్నచేయి దియ్యఁ జాలరా

చ. 1: చెప్ప రానిమాట లైన జెసేఁ గాని నీతో
       నప్పటి నెదురు మాటలాడ నోపరా
       కుప్పళించి పెంజెమట గురిసేఁ గాని నీకుఁగా
       తప్ప కిట్టె మోము చూచి తలవంచ నోపరా

చ. 2: నేయ రానిపని కైన చేరి వొడిగట్టేఁ గాని
        ఆయెడె నిన్నుఁ బాసే అందు కోపరా
        చాయల సరసమున సందడిఁ బొరలేఁ గాని
        పాయపుమదాన సిగ్గువడఁగ నే నోపరా

చ. 3: యేకతాన నెందు నైన నియ్యకొనేఁ గాని నిన్నుఁ
        గాకుగా మందెమేళాలఁ గప్ప నోపరా
        యీకడ శ్రీవెంకటేశ యిట్లాఁ గూడుండేఁ గాని
        దాకొని జంకించి నిన్ను తక్కించ నోపరా