పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0318-4 శ్రీ రాగం సంపుటం: 11-106

పల్లవి: మేలు మేలు రమణుఁడ మెచ్చితి నిన్ను
          చాలి నీసేఁతల కెల్ల సంతోసింతు నేను

చ. 1: కలవు నామీఁద బత్తి కన్నులఁ జూచితి విదె
       వలచినవలపులు వన్ని కెక్కెను
       తలఁపులు దెలియక తమకింతు నింతె కాక
       యెలమి నీవల్ల నీవల్ల వెల తించుకంత లేదు

చ. 2: నిక్కమె నీ మాట లెల్ల నేఁ డీడకు వచ్చితిని
        తొక్కినపాదపుఁ దొక్కు తుదు కెక్కెను
        యెక్కుడు నీ నవ్వులకు నీసడింతు నింతె కాక
        యెక్కడా నీవొళ్ల దప్పు లెంచఁ జోటు గలదా

చ. 3: చెల్లెను నీ సేఁత లెల్ల చేపట్టి కూడితి విదె
        యెల్లగా నా కోరికెలు యీడేరెను
        కొల్లగా శ్రీవెంకటేశ కొసరుదు నింతె కాక
        పొల్లు లేని నీగుణాల పొరపొచ్చ మున్నదా