పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0318-3 భైరవి సంపుటం: 11-105

పల్లవి: నీ వెరఁగవా తగవు నీకు విన్నవించేమా
         వేవేలు సతులోన వెలయించ రాదా

చ. 1: నలుదిక్కులుఁ జూచేవు నాదిక్కు చూడఁగ రాదా
       వలపు నీ పై జల్లెటివనిత నేను
       పిలిచినవాఁడవు ప్రేమ చూపక మానవు
       తొలుతె కాఁగిట నించి దొద్ద సేయ రాదా

చ. 2: కానుక లందేవాఁడవు గక్కన నన్నంట రాదా
       పానికుచముల నిమ్మపండ్లదానను
       పూని నవ్వినవాఁడవు భోగించక మానవు
       నే నడిగినవేళనె నీవు లోఁగ రాదా

చ. 3: కడు నా సోదకాడఁవు కాఁగిలించుకో రాదా
       ఆడియాల మైన నీ యాఁటదానమ
       యెడయక శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
       కడమ లేకుండ నిట్టె గతి గూడ రాదా