పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0318-1 దేసాక్షి సంపుటం: 11-103

పల్లవి: మందెమేళమె నాకు మన్నింతవు గాన నీతో
         యిందుకుఁగా నీవు యెగ్గు లెంచకుమీ అయ్యా

చ. 1: వాలుకరెప్పల వంచి వడి నేఁ గొసరితిని
       తాలిమి లేక నీపైఁ దమకించితి
       వేళావే ళెరఁగక వేసరించితిని నిన్ను
       యీలీల నీచిత్త మెట్టో యెరఁగఁజుమ్మీ అయ్య

చ. 2: కుచ్చి కుచ్చి నిన్ను సారె గుబ్బల నే నొత్తితిని
       తచ్చి తచ్చి నోతోఁ బంతము లాడితి
       హెచ్చుగా సెలవి నిన్ను నిందరిలో నవ్వితిని
       మచ్చట నిన్నిటికిగా మొక్కెఁ జుమ్మీ అయ్యా

చ. 3: పాయపుమదాన నిన్నుఁ బట్టి చేతఁ దీసితిని
       చాయల సన్నల నిన్ను జంకించితి
       ఆయ మెరఁగక నిన్ను నలయించి కూడితిని
       మాయల శ్రీవెంకటేశ మానఁ జుమ్మీ అయ్యా