పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0031-2 ఆహిరి సంపుటం: 06-179

పల్లవి:

పాయరాని పదివేలు పనులు నీకు యీ
కాయము నీ విప్పుడైన కౌఁగిలించుమీ

చ. 1:

చిత్తజు తాపము చేత చిక్కవడ్డ దానం గాన
వొత్తి నీతో విన్నవించ నోపం గాని
యెత్తిన నీ విరహాన యే మౌదునో నన్ను
చిత్తగించి యెప్పుడైనాఁ జేరంగరమ్మీ

చ. 2:

తరి నిన్నుం బాసి మాట తడఁబడే దానం గాన
నెరి నిన్నుం దూరనాడ నేరం గాని
యెరగొని తలచీర యెరంగకున్నప్పుడైన
కరఁగి మఱవక నాకడ చూడుమీ

చ. 3:

దవ్వుల నిందాఁక నీకు తమకించే దానం గాన
జవ్వన మంటకు మనం జాలం గాని
రవ్వైన వేంకటరమణ నావద్ద నిట్టే
పవ్వళించి నేఁడైనాఁ బాయకుండుమీ