పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0031-1 శ్రీరాగం సంపుటం: 06-178

పల్లవి:

ఎటువంటి మోహంబు యెటువంటి పరిణతలొ
అటువంటి సతి పొందు లవి నీకె తగురా

చ. 1:

చక్కని జవరా లొకతె జారెడికొప్పొకచేతఁ
జెక్కుచు సన్నపు నవ్వు చిలికి చిలికి
చెక్కునఁ జెదరిన కమ్మం జెమటల తావులను
చొక్కుచు నిన్నరగంటం జూచె నెవ్వతెరా

చ. 2:

గద్దరి కన్నుల కలికి కమ్మని చల్లగాలి
అద్దిన దేహము తోడ నలసి యలసి
ముద్దుల రెప్పలు దెరచి ముందటి నీ తనవలపు
సుద్దులు దెలుపుచు నిన్నుం జూచె నెవ్వతెరా

చ. 3:

కొండల రాయండ నీ కొమరైన చెలిచన్నుఁ
గొండల నీ కెంగేలం గులికి గులికి
నిండిన కౌఁగిటిలోన నీవుం దానుం గలశుండి
వుండినటువలెం గూడి వుండె నెవ్వతెరా