పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0041-3 కేదారగౌళ సంపుటం: 06-174

పల్లవి:

ఏమి చెలియా యేలాగే
వేమారును వెల్లి విరిసీఁ బ్రేమా

చ. 1:

తోడితేదొకో తొయ్యలివానిఁ
దోడితేదొకో తొయ్యలి
వాడీఁ జిత్తమిదె వనితరొ మై
గాఁడి మదనుని కమ్మవిరులు

చ. 2:

తానే రాఁడొకో దైవమా వాఁడు
తానే రొఁడొకో దైవమా
నేనోప నిలువంగ నింకను
నానేరుపుల నానదు నామనసూ

చ. 3:

వీఁడేఁ గదవే వేంకటేశుఁడూ వీఁడే
వీఁడెఁ గదవే వేంకటేశుఁడూ
నాఁడే నమ్మించే నన్నును
నేఁడే కౌఁగిట నెలకొనె నాకు