పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0041-2 కన్నడగౌళ సంపుటం: 06-173

పల్లవి:

మఱపైన నొకకొంత మాటుగాదా
తెఱవ నూరక యేల తెలిపేరు సతులూ

చ. 1:

తరుణిని విరహ సంతాపంబు దావాగ్ని
ధరియించ చెమటైన దండ గాదా
మరుని కార్నుకబాణమహిమ గడు నెఱుఁగించె
దురదురనఁ జేతులనె తుడిచేరు సతులు

చ. 2:

పొఁలితి కిపుడొకయింత పొద్దువోకలు సేయ
తలపోఁతయైన దరిదాపు గాదా
వెలలేని సోయగపు విభుని చల్లని రూపు
పెలచమాటలనే మరపించేరు సతులు

చ. 3:

అలివేణి మేని విరహాగ్ను లొయ్యన పూడ
నలరు నిట్టూర్పైన యాసగాదా
వలపెరిఁగి వేంకటేశ్వరుఁడు గరుణించె నిదె
కలువ పూవుల బంతి గట్టేరు సతులు