పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0040-4 ఆహిరి సంపుటం: 06-169

పల్లవి:

రమణుని చేఁతలు దక్కెను రావులు రంతుకు నెక్కెను
మమతలు లోలోఁ జొక్కెను మాటలు మఱియేలే

చ. 1:

తలపోఁతలు తనుఁ గూడెను తాలిమి గంటును వీడెను
కలువలు ఇరుమైఁ గాఁడెను కటకట యిఁక నేమే
బులుపులు సిగ్గుల కోడెను పులకలు సమతలు గూడెను
చలములకును విధి మూడెను జవ్వన మిది యేలే!

చ. 2:

మచ్చికమానము రేఁగెను మచ్చరములె మతి మూఁగెను
చిచ్చును గాలియుఁ గూడెను చీచీ యిఁక నేమే!
ముచ్చట రతి కెదురేఁగెను మురిపము వెనుకకు వీఁగెను
వెచ్చి వివేకము, రాఁగెను వేడుక లిఁక నేలే

చ. 3:

భారపు చెమటలు జాఱెను పై చెమటలు దైవాఱెను
కూరిమి కడుఁ దుద మీఱెను కొంకెడి దిఁక నేలే
వీరిఁడి వెఱపును జాఱెను వేంకటపతి కృప చేరెను
గారవములు కడుఁబేరెను కసరెడి దిఁక నేలె