పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0040-5 శ్రీరాగం సంపుటం: 06-170

పల్లవి:

రాకురాకు మయ్యా మాతో రంతు లింతేలా
వాకు నిష్టూరాన నిన్ను వద్దనే నేఁ జాలను

చ. 1:

తొలవయ్య కాలుదాఁకీ దో‌సాలు గట్టకా
తొలుతేమి చేసితినో తొయ్యలినైతి
చెలఁగి యిందఱూ నీకుఁ జేయెత్తి మ్రొక్కగా
చిలుకు గోళ్ల నిన్నుఁ జెనక నేఁ జాలను

చ. 2:

ఏమిటికి నంటించేవు ఎంగిలి మామోవి
బూమిలేని చదువుల పుట్ట నీనోరు
వేమాఱు నిందఱు నీకు వినుతించి మ్రొక్కంగ
ప్రేమపునో ర నిన్ను పేరఁ దిట్టఁజాలను

చ. 3:

యేల కిందుపడి మొక్కే వేమి బాఁతినే నీకు
కూళ నింతేని కాలిగోరఁ బోలను
మేలిమి శ్రీ వేంకటేశ మెఱసి మాచనవు
మేలములాడుచు నిన్ను మెప్పించ నేఁ జాలను