పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0040-3 ఆహిరి సంపుటం: 06-168

పల్లవి:

నేరుపులమాట గాదు నీయాన
కూరమి నీచే జట్టిగొనక నిన్నొల్లను

చ. 1:

తట్టుపునుంగుల తలచెంచెతను నన్ను
పట్టకురా నీకు నీపాదమాన
గట్టిగఁ దామరలోని కాంత మానితినని
గుట్టుదీర నానవెట్టుకొనక నిన్నొల్లను

చ. 2:

పయ్యెద పాఱుటాకుల భారంపు గుబ్బల నన్ను
తియ్యకురా నీకు నీదేవరాన
వ్రయ్యములు తొమ్మిదైన వనిత మానితినని
కొయ్యతనమున బాసగొనక నిన్నొల్లను

చ. 3:

నలఁగు జవ్వాదిమేని నన్నుఁ గడుంగౌగిట
నలమకు నీకు నీయమ్మాన
ఎలయించి తిరువేంకటేశ కూడితి నన్ను
కెలన నీవెటు దొలంగినను నిన్నొల్లను