పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0040-2 ఆహిరి సంపుటం: 06-167

పల్లవి:

ఏఁపుచు నాకా ళ్లితఁడేల పట్టేనె
రాఁపు సేసి నాకుఁ బెద్దమోపు గట్టినట్లు

చ. 1:

తలమాసి కోకమాసి తాపమున నుండంగాను
యెలయించి యితఁడు నన్నేల యేఁచీనే
మలినమై దేహమెల్ల మఱచినఁ దలఁపించి
వులికి కాలఁగఁ గొఱవులఁజూఁడినట్లు

చ. 2:

కూడుఁబాసి నీటిఁబాసి కొరమాలి వుండఁగాను
యేడనుండో వచ్చి యీతఁ డేల పోరీనే
వేడుక లన్నియు మాని వేదనల నుండఁగాను
కాఁడినపోట్లలోన కత్తిఁగోసినట్లు

చ. 3:

తల్లిఁబాసి యుల్లువాసి‌ తరిలేక వుండఁగాను
యెల్లగా కౌఁగిట నితఁ డేల నొక్కీ నే
చెల్లునంటా నన్ను గూడి శ్రీ వేంకటేశుండు
ముల్లు ముంటనే తీసి మోసపుచ్చినట్లు