పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0039-6 సావేరి సంపుటం: 06-165

పల్లవి:

ఊరకే పోనియ్యరా నన్నుద్దండాన
చేర లంతేసి కన్నులఁ జెంగలించే విప్పుడు

చ. 1:

జూద మాడఁ బిలిచేవు చూపులనే జంకించేవు
పేదవారి మేన సొమ్ము పెట్టనియ్యవా
కేదమున నోడి గెలిచితినంటా నా
పాద మంటి తీసుకోరా బంగారు మట్టెలు

చ. 2:

నెత్తమాడఁ బిలిచేవు నెఱవాది నంటాను
అత్తమామ గలవార మదేమి రా!
ఒత్తి విన్నవించలేము ఓడితేను నీకు నాకు
రిత్తమాట వద్దు రేఖరేఖ పందెమా!

చ. 3:

సొక్కటాలు నిన్న నాడి సోలి సత్యభామకు
మ్రొక్కితివి నేఁడు నాకు మ్రొక్కవలెఁగా
చక్కని వేంకటపతిస్వామి నన్నుం గూడితివి
మొక్కెద కర్పూర తాంబల మిరా చాలును