పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0039-5 ఆహిరి సంపుటం: 06-164

పల్లవి:

చూచియుం జూడవు సుదతివంక
నీచేఁత లిన్నియు నీకె చెల్లును

చ. 1:

జిగి మించు నుంగరాల చెక్కుమిఁది చేయి
చిగురు చెంద్రిక గోళ్ల జెలువొందంగా
పగటుఁ గోపము తోడ భారపు టూర్పులతోడ
నిగి డున్న చెలి లాగు నీకే తెలును

చ. 2:

పొడపు గుబ్బలి మీఁది పులిపట్టు చెఱంగు
జడిసి హారపుఁ గాంతి ఝళిపించఁగా
వడ చల్లుమేనితో వసివాఁడు జూపుల
నిడువాలుఁ గనుసొంపు నీకే తెలుసును

చ. 3:

భారపుఁ దురుము మీఁద పసమించు నెఱులు
జీరువారి విరులతోఁ జెంగలించఁగా
చేరువనే కూడితివి శ్రీ వేంకటేశుండ
నీరజవదనలాగు నీకే తెలుసును