పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0039-4 బౌళి సంపుటం: 06-163

పల్లవి:

ఒడలి తాపముమీఁద నుసురనీని
కడలేని చిచ్చుమిఁద గాలి చల్లీఁ దరుణి

చ. 1:

జల్లనం గొప్పు విరులు జారఁ దోచి జవరాలు
మెల్లనే తుమ్మిదలకు మేఁత వెట్టీని
చెల్లఁబో మీఁ దెఱుంగదు జెప్పరమ్మ పెనుఁబాము
పిల్లలకుఁ బాలువోసి పెంచఁజూచీఁ దరుణి

చ. 2:

గొప్పవైన గుబ్బలపైఁ గుంకుమ కస్తూరి పూఁత
లప్పలు గాలికిఁ దెచ్చి లంచ మిచ్చీని
ఒప్పదు మానుపరమ్మా ఉప్పతిలఁ బలుమారు
నిప్పుల మీదటఁ దెచ్చి నేయి చల్లీఁ దరుణి

చ. 3:

చెనకించి యధరంపుఁ జిగురాకు కెంపుల
నొనరుఁ గోవిల నోరూరించీని
చనవున వేంకటస్వామి కౌఁగిటఁ గూడి
కినిసి పాసెములూఁ జక్కెర వెట్టెఁ దరుణి