పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0038-5 సామంతం సంపుటం: 06-159

పల్లవి:

వలపువో కారణము వైభవంబులకుఁ దమ
తలఁపువో సకలంబుఁ దగులు సేసినది

చ. 1:

చూపువో ప్రియములకుఁ జోటుసేసినది తరి
తీపువో వెడ యాస దీరనీయనిది
రూపువో సౌఖ్యంబు రుచి సేసినది పువ్వుఁ
దూపువో హృదయంబు దూరిపాఱినది

చ. 2:

ఒఱపువో పెడఁబాసి వు డనియ్యనిది తమ
వెఱపువో దేహంబు వెచ్చఁజేసినది
మఱపువో ధైర్యంబు మానిపించినది కను
గిఱుపువో సిగ్గెల్లఁ గ్రిందు పఱిచినది

చ. 3:

చెలిమివో కారణము శ్రీ వేంకటేశు కృప
కలిమివో మచ్చికలు కలుగఁజేసినది
ఎలమివో యీపొందు లితవు సేసినది మరు
బలిమివో కోరికలఁ బట్టి తెచ్చినది