పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0038-1 పాడి సంపుటం: 06-154

పల్లవి:

ఇంతేపో వల పిందరికి
దొంతల వింతల రంతులును

చ. 1:

చిత్తపు టీతఁలు చిడిముడి సేఁతలు
పొత్తుల తమ తల పోఁతలును
మెత్తని యధరపు మేఁతలు లోలో
కుత్తికెఁ గులికెడి కూఁతలును,

చ. 2:

చూపుల తీపులు సొక్కుల పులకలు
దాపుల తమతమ తమకములు
కోపపు కిసరులు కూటపు కొసరులు
ఏపున విరహపు టెసరులును

చ. 3:

పువ్వుల వాట్లు వున్నమ చాట్లు
నవ్వుల పృదయపు నాట్లును
రవ్వగు వేంకటరమణునిఁ గలిసిన
యివ్వల మరువం పేట్లును