పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0037-4 కన్నడగౌళ సంపుటం: 06-151

పల్లవి:

చక్కని సరసపు శిశువు
పెక్కుమాయల పెను శిశువు

చ. 1:

చిమ్మెడి విషములు చేఁపిన రొమ్ములు
కొమ్మని యిచ్చినఁ గుడిచేని
బొమ్మర పోవఁడు పూతకిఁ బొరిగొని
అమ్మరో గయ్యాళి శిశువు

చ. 2:

చుట్టమువలెనే సుడిగాలినిఁ గని
బెట్టుగఁ గౌఁగిట బిగించేని
పుట్టఁడు వొడమఁడు బూమెలే చేసీ
పట్టరే పసి బాల శిశువు

చ. 3:

పాదము చాఁ చటు బండి జాతురకు
ఆదిగొనుచు తా నలరీని
వేదవేద్యుఁ డగు వేంకటగిరిపై
మోద మందిన మున్నిటి శిశువు