పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0037-3 శుద్దవసంతం సంపుటం: 06-150

పల్లవి:

తాపంబుం గోపంబు తమకుందామే వేఁగు
పై పై నే వగపు లోపలి కెల్లా వేఁగు

చ. 1:

చెలియ దురిమిన తురుము శిరసునకుఁ గడువేఁగు
తలపోత శిరసు కరతలమునకు వేఁగు
కొలఁది మీఱిన యూర్పు కుచయుగములకు వేఁగు
బలువు కుచములు నాభిపయి కల్లవేఁగు

చ. 2:

మురిపంపు నడపు చెలిమొలనూలికిని వేఁగు
బిరుసైన మొలనూలు పిరుఁదునకు వేఁగు
అరిది జఘనము మందయానంబునకు వేఁగు
తరుణి గమనము పాదతలమునకు వేఁగు

చ. 3:

మృగనేత్రిప్రాణంబు మేని కింతకు వేఁగు
బుగులుకొను మైకాఁక పులకలకు వేఁగు
తగు వేంకటేశు కృప ధైర్యంబునకు వేఁగు
అగపడిన యీపొందు అలుకలకు వేఁగు