పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0036-5 దేశాక్షి-యెకతాళి సంపుటం: 06-146

పల్లవి:

పరతత్త్వం బగు బాలుఁడు
పరిపరి విధముల బాలుఁడు

చ. 1:

చద్దుల మూటలు చంకల వ్రేలెడి
ముద్దుల పడుచుల మూఁకలతో
పెద్దఱికంబునఁ బేయలఁ గాచిన
బద్దుల నటనల బాలుండూ

చ. 2:

వెన్నలు దాఁకఁగ వేట్లాడుచును
సన్నపు బడుచుల సంగడిని
కన్నెలు దూరఁగఁ గలకల నవ్విన
పన్నిన మాయల బాలుండు

చ. 3:

బచ్చన రూపుల పాయపుఁ బడుచులు
నిచ్చలుఁ గొలువఁగ నెమ్మదిని
నచ్చిన వేంకట నగమున నాడెడి
పచ్చిల పదకపు బాలుండు