పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0036-4 దేసాళం సంపుటం: 06-145

పల్లవి:

ఇంతిరో నీ కోప మింతేటికే
చింతవాయఁ గరుణఁ జూచీ గాని నిన్నును

చ. 1:

చిత్తమేమి రాయో చెలియ నిన్నతఁడేమి
కొత్తగాఁబాలించె నో కూరిమి లేదో
వత్తునని రాకుంటె వచ్చీగా కిందేమి
తత్తరానఁ గన్నీటఁ దడిపేవు పయ్యెద

చ. 2:

అలుకేమి బరవో యతఁ డేమి యరవో
కలికి చేఁతలు నీకుఁ గరవో
సొలసి నీ కడకంటఁ జూచినఁ నాతని గుండె
తలఁక కెట్టుండె నీతలఁ కేలె నీకూ

చ. 3:

పువ్వుల వేసినంతనే పొక్కెనట నీమేను
నవ్వు లెంత జూపు నీకు నమ్మికగాదా!
యివ్వల నప్పుడే వేంకటేశుం డిదె నన్నుఁ గూడె
దవ్వులే చేరువ లాయె దక్కెఁగా నీ పనులు