పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0035-6 ఆహిరి సంపుటం: 06-141

పల్లవి:

కాఁగె నిట్టూర్పులై గాలి మారుకుమారు
ఈఁగి చేసినదైవ మెఱుఁగఁడాచేఁత

చ. 1:

చెలికి విరహాగ్ని రేఁచినఫలము చెదరఁగా
ఎలఁదేఁటు లలకలై యెదు రెదురనె
పొలఁతికోవిలలు నటువలెనెపో లలితాంగి
పలుకులై సన్నగిలెం బాయునా చేఁత

చ. 2:

చెంది వెన్నెలల వేఁచిన ఫలము బడలెఁగా
చందురుఁడు వదనమై సతి కిచటనె
అందంద కలువలకు నట్లఁబో కలువలై
పొందెడలి యరమొగిచెఁ బో నాచేఁత

చ. 3:

పడతివేఁచిన ఫలము పన్నీరు నుడికెఁగా
ఉడికేటి చెమటలై యొడలిమీద
అడరి యంతట వేంకటాధిపుని కౌఁగిటనె
తొడరి యిన్నియు దీర్చె దొరకెఁగా చేఁత