పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0035-4 ముఖారి సంపుటం: 06-139

పల్లవి:

అరిది చేఁదుం దీపై నంతకంటేనా
సరిలేని విభుతోడఁ జయ్యాటమాడేవు

చ. 1:

చలమునం బగవారు సైతము నొకవేళ
పలుక దేరే రట యంతకంటేనా
పొలయలుకలు దీరి పురుషుఁడిప్పుఁడు నిన్నుఁ
బిలువఁ బంపనయంత బిగు వేలే నీకు

చ. 2:

తప్పులు సేసిన వారి దయసేసి రాజైన
అప్పుడే మచ్చికం గూడీ నంతకంటేనా?
తిప్పిన మొకము తోడి ధీరుండు విభుండు నీకు
గప్పురపు విడె మియ్యంగఁ గడకంటఁ జూడవు

చ. 3:

యెడసి యెదిరిం దము నెఱుంగక పైకొన్న
నడవిమెకాలు గూడీ నంతకంటేనా?
కడు నొవ్వ నాడి వెంకటవిభునికి నీవే
వెడమోము కూటముల వెఱపించుకొనేవు