పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0035-3 శంకరాభరణం సంపుటం: 06-138

పల్లవి:

చతురుం డని నాసరసతలూ
ఇతరము లైనవి యేమి సేతురా

చ. 1:

చెనకుచు నీవు నాకు సేసిన మేలు
పెనఁగొని మతిలోఁ బెరిగేని
మనసు తమకమై మదనతాపమయి
యెనలేని విభుఁడ యేమి సేతురా

చ. 2:

కదలు నీ మురిపపుంగన్నుల నగవు
పొదలుచు నామతిఁ బొలసీని
చెదరని యలపై చింతారతియై
హృదయము రేఁచి నేమిసేతురా

చ. 3:

ఇపు డిటు నీవు నా కిచ్చినచనవు
అపరిమితములై యలరీని
విపులవిభవమై వేంకటేశ!నా
కెపుడు బాయ దిదే యేమి సేతురా