పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0035-1 ఆహిరి సంపుటం: 06-137

పల్లవి:

వావి గాదు నీకు నాకు వద్దు వద్దు నీ
తోవరా వెఱుతు మన్నా దోసాలు గట్టకురా

చ. 1:

చక్కనివాఁడ ననుచు సారెసారె నీవు వోరి
లెక్కలేని నొయ్యారములే చల్లేవు
తక్కుల మొన్న నామఱందలితోడ నీవు వోరి
తొక్కులాడితివి చాలు దోసాలు గట్టకురా

చ. 2:

చూడకురా నా వంక సోయగపు నీవు యీ
వేడుక చిఱునగవే వెదచల్లేవు
కూడితి నాచెలిమి మక్కువ విన్న నీవు వోరి
తోడనే యింతేసి నాకు దోసాలు గట్టకురా

చ. 3:

రాఁగినది నీ చిత్తము రంతుకాఁడ నీవు వోరి
మాఁగిన నా మనసు పై మచ్చు చల్లేవూ
కౌఁగిలించి నన్ను వెంకటరాయ నీవు వోరి
తఁగు మంచానకుం దీసి దోసాలు గట్టకురా!